
సమన్వయంతో హెచ్–సిటీ పనులు వేగిరం
గచ్చిబౌలి: హెచ్– సిటీ పనుల వేగవంతానికి అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ముందుకెళ్లాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి సూచించారు. ఆదివారం శేరిలింగంపల్లి వెస్ట్ జోనల్ పరిధిలో చేపడుతున్న హెచ్–సిటీలో ప్రతిపాదించిన ఫ్లై ఓవర్లు, రోడ్ల విస్తరణతో పాటు జంక్షన్ల విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జంక్షన్ల వద్ద స్థల సేకరణ వేగవంతంగా చేపట్టాలన్నారు. సంబంధిత విభాగాల అధికారులు బస్సులో ప్రయాణించి యుటిలిటీ విద్యుత్, వాటర్ వర్క్స్, టెలిఫోన్ వైర్లను వెంటనే తొలగించాలని సూచించారు. ఖాజాగూడ, సైబరాబాద్ కమిషనరేట్, గచ్చిబౌలి, ట్రిపుల్ ఐటీ, విప్రో జంక్షన్లు, డీఎల్‌ఎఫ్ రోడ్డు, మసీద్ బండ, చందానగర్ రైల్వే స్టేషన్, లింగంపల్లి ఆర్‌ఓబీ, శ్రీదేవి టాకీస్, గంగారం రోడ్డు, ఆల్విన్ క్రాస్ రోడ్డు తదితర ప్రాంతాలలో హెచ్‌సిటీలో ప్రతిపాదిత పనులను పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పురపాలక శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డెవిస్, చీఫ్ ఇంజినీర్ భాస్కర్ రెడ్డి, టీజీఎస్‌పీడీసీఎల్ అధికారులు శేఖర్, పాండ్యన్, వెస్ట్ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, వేణుగోపాల్ రెడ్డి, టీజీఎస్‌ఐఐసీ ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment