
జీతం సరిగా వస్తలేదు
నెలనెలా జీతం వస్తుందనే ఆశతో పనిచేస్తున్నా. మూడు నాలుగు నెలలకోసారి ఇస్తున్నారు. జీతం అందక, ఇల్లు గడవక అప్పు చేయాల్సి వస్తోంది. రోజుఏదో ఒకచోట పూడికతీత, చెత్త తొలగింపు వంటి పనిచేస్తూనే ఉంటాం. అధికారులు స్పందించి వేతనం సరిగా అందేలా చూడాలి.
– గడ్డమీది లక్ష్మయ్య, జీపీ కార్మికుడు, తాళ్లపల్లి, షాబాద్ మండలం
అప్పులు తెచ్చి పనులు
గతంలో చేసిన పనులకు బిల్లులు రాక అప్పులపాలయ్యాం. గ్రామాల్లో సర్పంచ్‌లు లేక పోవడంతో కార్యదర్శులు అప్పులు తెచ్చి పనులు చేయిస్తున్నారు. ఇప్పటి వరకు నిధులు లేక, అభివృద్ధి పనులు లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఎన్నికలు నిర్వహించకపోవడం దారుణం.
– చందిప్ప జంగయ్య, మాజీ సర్పంచ్, మల్లారెడ్డిగూడ, షాబాద్

జీతం సరిగా వస్తలేదు
Comments
Please login to add a commentAdd a comment