అంతా కలిస్తే బాగుంటుందనే..
చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలని 1981–82 బ్యాచ్ పూర్వ విద్యార్థులం అంతా అనుకున్నాం.. పాఠశాలలో చదివిన అన్ని బ్యాచ్‌ల విద్యార్థులు కలిస్తే బాగుంటుందని, పాఠశాల అభివృద్ధికి మరింత తోడవుతుందని ఆలోచన వచ్చింది. దీనికి 50 ఏళ్ల స్వర్ణోత్సవ వేడుక కూడా కుదిరింది. ఆరు నెలలుగా పూర్వ విద్యార్థులను అందరినీ కలుస్తూ గ్రూప్ క్రియేట్ చేసి ఏకం చేసేందుకు కృషి చేశాం. పూర్వ విద్యార్థులంతా వేడుకలకు హాజరుకావడం.. పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని ప్రకటించడం మరింత సంతోషాన్ని నింపింది.
– ఆర్. శ్రీనివాస్‌గుప్తా, పూర్వ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment