ఆమనగల్లు లయన్స్‌క్లబ్‌కు అవార్డుల పంట
ఆమనగల్లు: లయన్స్‌క్లబ్ రీజియన్ పరిధిలో చేపట్టిన సేవా కార్యక్రమాల నిర్వహణకు గాను ఆమనగల్లు లయన్స్‌క్లబ్‌కు అవార్డుల పంట పండింది. ఏటా రీజియన్ పరిధిలో అత్యుత్తమ సేవలు అందించే లయన్స్‌క్లబ్‌లకు అవార్డులు అందిస్తారు. ఈ ఏడాది నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని తేజ కన్వెన్షన్ హాలులో ఆదివారం జరిగిన లయన్స్‌క్లబ్ రీజియన్ సమావేశంలో రీజియన్ చైర్మన్ డా.శ్రీను లయన్స్‌క్లబ్‌లకు అవార్డులను అందించారు. 2024–25 సంవత్సరానికి గాను చేపట్టిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా మొత్తం వివిధ విభాగాల్లో ఆమనగల్లు లయన్స్‌క్లబ్ 33 అవార్డులు దక్కించుకుంది. రీజియన్ పరిధిలో ఎక్సలెంట్ క్లబ్‌గా ఆమనగల్లు లయన్స్‌క్లబ్, అత్యుత్తమ లయన్స్‌క్లబ్ అధ్యక్షుడిగా ఆమనగల్లు లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు పసుల లక్ష్మారెడ్డి, ఉత్తమ కార్యదర్శిగా మహేశ్, ఉత్తమ కోశాధికారిగా నర్సింహ, అత్యుత్తమ పీఆర్‌ఓగా పాష అవార్డులు అందుకున్నారు. అలాగే రక్తదాన శిబిరాలు, మెగా వైద్య శిబిరాలు, మధుమేహ పరీక్షల శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలకు గాను అవార్డులు దక్కాయి. ఆమనగల్లు లయన్స్‌క్లబ్‌కు అవార్డులు రావడానికి సహకరించిన లయన్స్‌క్లబ్ మల్టీపుల్ ఏరియా లీడర్ నరేందర్‌రెడ్డి, కోఆర్డినేటర్ చెన్నకిషన్‌రెడ్డి, మాజీ లయన్స్ గవర్నర్‌లు రమేశ్‌బాబు, రాధాకృష్ణ, రాంరెడ్డి తదితరులకు లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పీఆర్‌ఓ పాషా కృతజ్ఞతలు తెలిపారు.
వృక్షార్చన జయప్రదం చేయండి
పరిగి: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని సోమవారం నిర్వహించనున్న వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన పట్టణ కేంద్రంలోని తన నివాసంలో ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మహేశ్‌రెడ్డి మాట్లడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతీ కార్యకర్త మూడు మొక్కలు నాటాలని సూచించారు. నాటిన మొక్కతో దిగిన సెల్ఫీని 90003 65000 నంబర్‌కు వాట్సాప్ చేయాలని కోరారు. భూగోళాన్ని నివాసయోగ్యంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అరవింద్‌రావు, పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, సీనియర్ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ అడ్మిషన్లకు దరఖాస్తులు
తాండూరు రూరల్: మండల పరిధిలోని జినుగుర్తి గేటు వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్‌లో అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో 100 సీట్లు, 7 నుంచి 10వ తరగతిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం ఆన్‌లైన్‌లో ఈనెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 13న ఎంట్రెన్స్ పరీక్ష ఉంటుందన్నారు. ఓసీలు రూ.200, ఇతరులు రూ.125 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.
ఆమనగల్లు లయన్స్‌క్లబ్‌కు అవార్డుల పంట
Comments
Please login to add a commentAdd a comment