వన మహోత్సవానికి కార్యాచరణ
షాద్‌నగర్: పుడమి తల్లిని మరింత పచ్చగా మార్చేందుకు.. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రభుత్వం వన మహోత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మొక్కలు నాటేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ప్రతీ గ్రామ పంచాయతీలో పదివేల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించడంతో ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీలతో నర్సరీల్లో బ్యాగుల్లో మట్టి నింపడం, విత్తనాలు నాటడం వంటి పనులు చేపడుతున్నారు.
వేడిని తట్టుకునేందుకు..
నర్సరీల్లో పెంచే ప్రతీ మొక్కను బతికించుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వేసవి కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో నర్సరీల్లో పెంచే మొక్కలు ఎండకు ఎండిపోకుండా గ్రీన్‌నెట్.. వాటి కింద మొక్కలను పెంచుతున్నారు. వర్షాకాలం ప్రారంభం అయిన వెంటనే గుంతలు తీసి నాటేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోంది.
నీడ నిచ్చే మొక్కలకు ప్రాధాన్యత
నర్సరీల్లో నీడనిచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. నీడనిచ్చే కానుగ, రావి, మర్రి, చింత చెట్లతో పాటు ఈత, తాటి, ఇంటి ఆవరణలో పెంచేందుకు దానిమ్మ, నిమ్మ, సీతాఫలం, తులసి, నేరేడు, లిల్లీ, మందారం, పారిజాతం, గులాబీ, గన్నేరు, మందారం, కరివేపాకు, బొప్పాయి, మునగ, జామ మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. ఆయా గ్రామాలకు నర్సరీల నుంచి పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
నర్సరీల్లో మొక్కల పెంపకం
ఉపాధి కూలీలతో పనులు
వర్షాకాలం ప్రారంభమైన వెంటనే నాటేలా ఏర్పాట్లు
ప్రత్యేకంగా దృష్టి సారించిన అధికారులు
అవసరమైన మొక్కలు సిద్ధం
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గ్రా మాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తు న్నాం. అవసరమైన మొ క్కలు నర్సరీల్లో సిద్ధం చేస్తున్నాం. నర్సరీల్లో నీడనిచ్చే మొక్కలతో పాటు వివిధ రకాల పండ్ల మొక్కలను పెంచుతున్నాం.
– అరుణ, ఏపీఓ, ఫరూఖ్‌నగర్
వన మహోత్సవానికి కార్యాచరణ
Comments
Please login to add a commentAdd a comment