‘స్థానిక’ పోరులో గుణపాఠం తప్పదు
ఆమనగల్లు: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 18న ఆమనగల్లులో నిర్వహించే రైతుదీక్షకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారని ఆయన తెలిపారు. పట్టణంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్స్‌లో రైతుదీక్ష వేదిక ఏర్పాట్లను ఆదివారం ఆయన మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, తలకొండపల్లి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు దశరథ్‌నాయక్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై స్థానిక నాయకులకు పలు సూచనలు చేశారు. అనంతరం లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు అధికారం కోసం ప్రజలకు అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రైతులకు రుణమాఫీ పూర్తిగా జరగలేదని, రైతుభరోసా అందలేదని అన్నారు. మహిళలకు నెలనెలా రూ.2,500 ఇస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కేటీఆర్ దీక్షకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తరలివచ్చి జయపరదం చేయా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆమనగల్లు మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కన్వీనర్ పత్యానాయక్, మాజీ ఎంపీపీ నిర్మల, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నర్సింహ, మాజీ సర్పంచ్‌లు శ్రీనునాయక్, జ్యోతయ్య పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం
రైతు దీక్షను జయప్రదం చేయాలి
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment