దోమ: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఓ లారీని పోలీస్‌లు సీజ్ చేశారు. ఈ ఘటన బొంరాస్‌పేట మండలం బొట్లబోని తండాలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఆనంద్‌కుమార్ తెలిపిన ప్రకారం.. తండాకు చెందిన రమావత్ దేశ్యనాయక్ తండ్రి హీర్యానాయక్(44) తనకున్న టిప్పర్‌తో ఇసుక వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన ఆదివారం రాత్రి బుద్లాపూర్ మీదుగా ఇసుక తీసుకెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు లారీని పట్టుకుని అనుమతి పత్రాలు, వాహన పేపర్లను పరిశీలించగా ఏవీ లేవని సమాధానం వచ్చింది. దీంతో పోలీసులు టిప్పర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు సోమవారం పోలీసులు దేశ్యానాయక్‌పై కేసు నమోదు చేసి వాహనాన్ని తహసీల్దార్‌కు అప్పగించామని ఎస్‌ఐ చెప్పారు.
నేడు వాహనాల వేలం
మోమిన్‌పేట: మండల కేంద్రంలోని ఎకై ్సజ్ కార్యాలయంలో ఉన్న వాహనాలను మంగళవారం వేలం వేయనున్నట్లు ఎకై ్సజ్ ఎస్‌హెచ్‌ఓ సహదేవుడు ఓ ప్రకటనలో తెలిపారు. వేలంలో పాల్గొనే వ్యక్తులకు ప్రభుత్వ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఆసక్తి గలవారు ఉదయం 10–30 నిమిషాలకు కార్యాలయానికి రావా లని సూచించారు. ఈ వాహనాలు నిషేధిత వస్తువుల నేరాలకు సంబంధించి సీజ్ చేసినవిగా ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment