పార్టీల మధ్య ఫ్లెక్సీల వివాదం
బడంగ్‌పేట్: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పందంగా మారింది. ఇదెలా జరిగిందంటూ బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫ్లెక్సీల విషయంలో అధికార పార్టీ నేతలు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు సైతం కాంగ్రెస్ వారికే మద్దతు తెలుపుతున్నారని విమర్శించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ శ్రేణులు.. రోడ్లకు ఇరువైపులా కటౌట్లు, బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేయగా.. ఆదివారం రాత్రికిరాత్రే వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. దీంతో గులాబీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. సోమవారం కమిషనర్ సరస్వతికి ఫిర్యాదు చేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ.. బ్యానర్లు తొలగించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీల కతీతంగా విధులు నిర్వహించాలని కమిషనర్‌కు సూచించారు. మరోసారి ఇలాంటివి జరిగితే.. ఆందోళన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. దీనికి స్పందించిన ఆమె.. ఫ్లెక్సీలు ఎవరు, ఎందుకు తొలగించారో తెలుసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్‌ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అర్జున్, మాజీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు ఉన్నారు.
బ్యానర్ల తొలగింపుపై బీఆర్‌ఎస్ నాయకుల ఆందోళన
కమిషనర్ సరస్వతికి ఫిర్యాదు
Comments
Please login to add a commentAdd a comment