చోరీ కేసులో వ్యక్తి అరెస్ట్, రిమాండ్
కడ్తాల్: పార్కింగ్ చేసిన ఆటోను అపహరించిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు. సీఐ శివ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. కందుకూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన సదానందంగౌడ్, రామచంద్రయ్య ఇరువురు ఆటోలో ఈ నెల 9న మండల కేంద్రంలోని అగస్త్య ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చారు. ఆస్పత్రి ఎదుట ఆటోను పార్కింగ్ చేసి, వైద్యం చేయించుకుని వచ్చేసరికి ఆటో కనిపించలేదు. వెంటనే డ్రైవర్ సదానందంగౌడ్.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక టీంను ఏర్పాటు చేశారు. క్రైమ్ టీం సిబ్బంది రాజశేఖర్, రాంకోటీలు సోమవారం మండల కేంద్రంలోని తలకొండపల్లి క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం కోమటికుంటకు చెందిన నాగశేషు అనుమానస్పదంగా వ్యవహరించడంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరం ఒప్పుకున్నాడు. అనంతరం అతన్ని అరెస్టు చేసి, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు నాగశేషును రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరిచి, జైలుకు తరలించారు. నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన క్రైమ్ టీం సిబ్బందికి పోలీసు ఉన్న తాధికారులు అభినందించినట్లు సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment