గతంలో కాలువను మరోచోట కబ్జా చేసి పైపులు వేశారు. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో పైపులు తొలగించారు. తాజాగా టిప్పర్లతో మట్టి తెచ్చి పోస్తున్నారు. కాలువను కబ్జా చేస్తున్నారని ఆదిబట్ల మున్సిపాలిటీలో, కలెక్టరేట్‌లో ఎంపీపటేల్‌గూడ వాసులు ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఓవైపు మున్సిపాలిటీ అధికారులు అండర్ డ్రైనేజీ నీరు ఇదే వాగులోకి కలిపి కలుషితం చేశారని, మరోవైపు కబ్జా పాలవుతున్న పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇలాగే వదిలేస్తే వాగు మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కాలువను పరిరక్షించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment