
రైతు దీక్షకు అంతా సిద్ధం
ఆమనగల్లు: ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆమనగల్లు పట్టణంలో మంగళవారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రైతు దీక్షకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. కార్యక్రమానికి అనుమతి కోరగా మొదట పోలీసులు నిరాకరించారు. దీంతో బీఆర్‌ఎస్ నాయ కులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆమనగల్లు పట్టణ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పాట్లను సోమవారం మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, గువ్వల బాలరాజు, రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, సింగిల్‌విండో చైర్మన్ గంప వెంకటేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు పత్యానాయక్ తదితరులు పరిశీలించారు.
నేడు ఆమనగల్లుకు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నాయకులు
Comments
Please login to add a commentAdd a comment