పోలీస్‌ కస్టడీకి వీరరాఘవరెడ్డి | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ కస్టడీకి వీరరాఘవరెడ్డి

Published Tue, Feb 18 2025 7:41 AM | Last Updated on Tue, Feb 18 2025 7:41 AM

-

అనుమతించిన కోర్టు

మొయినాబాద్‌: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని మూడు రోజుల పోలీస్‌ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పోలీసులు అతన్ని విచారించనున్నారు. ఈ నెల 7న రామరాజ్యం సైన్యం పేరుతో వీరరాఘవరెడ్డితో పాటు మరో 25 మంది చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి అర్చకుడు రంగరాజన్‌ ఇంట్లో ఆయనపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని ఈ నెల 8న పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టు అతనికి 14 రోజుల జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించడంతో చర్లపల్లి జైలుకు పంపారు. ఈ కేసులో కీలక విషయాలను రాబట్టేందుకు పోలీస్‌ కస్టడీకి ఇవ్వా లని పోలీసులు కోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చింది. మంగళవారం పోలీసులు అతన్ని చర్లపల్లి జైలు నుంచి కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మందిని అరెస్టు చేసిన పోలీసులు మరో 8 మంది నిందితులకోసం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో గాలిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement