ఆదిబట్ల మున్సిపల్ పరిధిలోని ఎంపీపటేల్‌గూడలో ఉన్న పులందరి వాగు ఆక్రమణకు గురైంది. ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి ఎంపీపటేల్‌గూడ మీదుగా మంగళ్‌పల్లి నుంచి మల్సెట్టిగూడలో ఉన్న చెక్‌డ్యాంకు ఈ వాగు నుంచే నీరు పారుతుంది. కాలువపై మట్టి పోసి కిలోమీటర్ మేర కబ్జా చేశారు. అక్రమార్కులు ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు. ఎంపీపటేల్‌గూడ పట్టణానికి ఆనుకొని ఉన్న చోట సుమారు 500 మీటర్ల మేర కబ్జాకోరులు టిప్పర్లతో మట్టి తెచ్చి కాలువను నింపేశారు. బఫర్ జోన్‌లోనే నిర్మాణం చేపట్టారు. దీంతో కాలువ మొత్తం కుంచించుకుపోయింది. వర్షాకాలం వస్తే పెద్ద ప్రవాహం వచ్చే కాలువ చిన్నగా అయిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment