హామీలు అమలు చేయాలి
ఇబ్రహీంపట్నం: అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ ఎంపీటీసీ, బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల నాయకుడు మైసయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దళితబంధు కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఆ ఊసే ఎత్తడం లేదని పేర్కొన్నారు. మహిళలకు ప్రతినెలా రూ.2500 పెన్షన్ ఇవ్వాలని, తులం బంగారం అందజేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి
అబ్దుల్లాపూర్‌మెట్: నైపుణ్యాలపై దృష్టి సారించడంతో పాటు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఐసీఎల్‌ఎస్ అసిస్టెంట్ డైరెక్టర్, పీఎం ఇంటర్న్‌షిప్ ప్రాజెక్టు ప్రాంతీయ నోడల్ ఆఫీసర్ అనుముల శ్రీకర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని బ్రిలియంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ క్యాంపస్‌లో ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకంపై మంగళవారం ఒకరోజు అవగాహన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్‌కే రుస్తుం పాల్గొన్నారు.
ఉపాధి సమస్యలపై ఆరా
యాచారం: ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ నరేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్కీజ్‌గూడ, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లో మంగళవారం కూలీల వద్దకు వెళ్లి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాబ్ కార్డులున్న ప్రతి కూలీ ఉపాధి పనులకు రావాలని సూచించారు. నింబంధనల ప్రకారం పనులు చేస్తే కూలి గిట్టుబాటు అవుతుందన్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనంతరం ఆయా గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను పరిశీలించి ఎండిపోకుండా సంరక్షించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఈజీఎస్ ఏపీఓ లింగయ్య ఉన్నారు.
రైతు దీక్షకు తరలిన నాయకులు
మాడ్గుల: కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని మాజీ వైస్ ఎంపీపీ శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం ఆమనగల్లులో నిర్వహించిన రైతు దీక్షకు మాడ్గుల నుంచి తరలివెళ్లారు. వీరిలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జైపాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ తిరుమల్ రెడ్డి, డైరెక్టర్ రాజావర్ధన్‌రెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, శంకర్‌నాయక్, విజయ్, రాజు, నిరంజన్, తదితరులు ఉన్నారు.
హాస్టళ్లలోని సమస్యలు పరిష్కరించాలి
నాగోలు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్సీ స్టూడెంట్ హాస్టల్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు కుమార్, ఇతర సభ్యులు మంగళవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖలో ఉన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ (210) కాలేజీ హాస్టల్స్, ఫ్రీ మెట్రిక్ హాస్టల్స్ (670) స్యూల్ హాస్టల్స్‌లలో ఉన్న సమస్యలపై గతంలో జీవోలను ప్రభుత్వం ద్వారా సాధించడం జరిగిందని కాని ఇప్పుడు ఉన్న పరిస్థితులలో జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదన్నారు. గతంలో జారీ చేసిన జీవోలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరారు.
నేడు రైతుబజార్‌కు సెలవు
దిల్‌సుఖ్‌నగర్: సరూర్‌నగర్ రైతు బజార్‌కు బుధవారం సెలవు ఉన్నందున ఎలాంటి క్రయ విక్రయాలు ఉండవని ఈఓ స్రవంతి తెలిపారు. ప్రతి నెల మూడో బుధవారం రైతు బజార్‌కు సెలవు ఉంటుందని గురువారం యథావిధిగా క్రమవిక్రయాలు కొనసాగుతాయన్నారు.
హామీలు అమలు చేయాలి
హామీలు అమలు చేయాలి
Comments
Please login to add a commentAdd a comment