కులగణన రీసర్వేలో అందరూ పాల్గొనండి
దిల్‌సుఖ్‌నగర్: కులగణ రీసర్వేలో అందరూ పాల్గొనాలని బీసీ కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆర్‌కేపురం డివిజన్‌లోని పలు కాలనీల్లో ఆయన పర్యటించి గతంలో కులగణనలో పాల్గొనని వారిని కలిసి ఈ సారి వివరాలు ఇవ్వాలని కోరారు. కులగణన సర్వేపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలో నిజం లేదని కొంత మంది ఉద్దేశపూర్వకంగానే సర్వేలో పాల్గొనలేదన్నార. కులగణన సర్వేను సమగ్రంగా నిర్వహించేందుకు బీసీ కమిషన్ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి సర్వేలో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పున్న గణేష్ నేత, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ సభ్యులు బండి మధుసూదన్ రావు, గట్ల రవీంద్ర, తల్లాటి రమేష్ నేత, శివ, ధనరాజ్ గౌడ్, గుండా నరసయ్య, జల్లా జగన్నాథం, దోర్నాల చంద్రమౌళి, దుర్గాప్రసాద్, ఆనంద్ కుమార్, ఇమ్రాన్, శ్రీశైలం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment