రంగరాజన్‌పై దాడిని ఖండిస్తున్నాం
మన్సూరాబాద్: హిందూ దర్మలో విద్వేషానికి తావులేదని, చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హిందూస్ ఫర్ పూరలిటీ అండ్ ఈక్వాలిటి జాతీయ ప్రధాన కార్యదర్శి రమణమూర్తి అన్నారు. ఎల్‌బీనగర్ సూర్యోదయనగర్‌కాలనీలోని జైభారత్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం వేదవాదం–శాంతినాదం వేద సూక్తల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బహుళత్వానికి, సమానత్వానికి, ద్వేష రహిత్యానికి హిందూ ధర్మం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. రంగారాజపై దాడికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో విజయశంకర్‌స్వామి, రజనీకుమార్, యడ్లపల్లి మోహన్‌రావు, త్రినాథ్, ఉమారాణి, నర్సింహాచార్యులు, సాధు త్రినాథ్, సుబ్రహ్మణ్యశర్మ, లక్ష్మినారాయణశర్మ, శరణ్‌శర్మ, దత్తాత్రేయశర్మ, గౌరీశంకర్‌శర్మ, వసుధాశర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment