తుక్కుగూడ: మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా హోర్డింగ్స్ ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ఏ.వాణి పేర్కొన్నారు. మంగళవారం పుర కేంద్రంలోని శ్రీశైలం జాతీయ రహదారిపై మున్సిపాలిటీ అనుమతులు లేకుండా అక్రమంగా భవనాలపై ఏర్పాటు చేసిన హోర్డింగ్స్‌ను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. హైడ్రా జోనల్ ఇన్‌చార్జి బి.సుదర్శన్‌రెడ్డి ఇటీవల తుక్కుగూడలో పర్యటించి వీటిని గుర్తించారన్నారు. హైడ్రా ఆదేశాల మేరకు వీటిని తొలగించామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ వాణి
Comments
Please login to add a commentAdd a comment