అభివృద్ధిని అడ్డుకునేందుకే కేటీఆర్ దీక్షలు
ఆమనగల్లు: రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకే మాజీ మంత్రి కేటీఆర్ దొంగ దీక్షలు చేస్తున్నారని పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఎన్నికల హామీలను వరుసగా అమలు చేస్తోందని తెలిపారు. ఇందులో ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తోందని స్పష్టంచేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూ.. సంక్షేమం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని వెల్లడించారు. గత ప్రభుత్వం రైతులకు చేసిన రుణమాఫీ మిత్తీకి కూడా సరిపోలేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, సంక్షేమ పథకాల అమలును చూసి ఓర్వలేక కేటీఆర్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మాడ్గుల ప్రాంతంలో రేవంత్‌రెడ్డికి 1,500 ఎకరాల భూమి ఎక్కడ ఉందో చూపించాలని సవాలు విసిరారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల పాపం గత సర్కార్‌దేనని తెలిపారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహ, ఆమనగల్లు, కడ్తాల్ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు జగన్, బిచ్చానాయక్, పట్టణ అధ్యక్షుడు మానయ్య, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరి శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్‌విండో డైరెక్టర్ చేగూరి వెంకటేశ్, కాంగ్రెస్ నాయకులు ధనుంజయ, ఖలీల్, అలీం, ఖాదర్, ఖరీం తదితరులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శిస్తే ఊరుకునేది లేదు
పీసీసీ సభ్యుడు అయిల శ్రీనివాస్‌గౌడ్
Comments
Please login to add a commentAdd a comment