
ప్రతి ఇంట్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండి
శంకర్‌పల్లి: పిల్లల తల్లిదండ్రులందరికీ చేతులు జోడించి వేడుకుంటున్నా.. ప్రతి ఇంట్లో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, ఐపీఎస్ మాజీ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. మండలంలోని దొంతాన్‌పల్లిలో ఆదివారం సక్సెస్ షోటోకాన్ కరాటే ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరాటే నేర్చుకోవడం ఎంత ముఖ్యమో, దానిని నిత్యం సాధన చేయడం అంత కన్నా ముఖ్యమని తెలిపారు. ఫోన్లలో సోషల్ మీడియా, టీవీలు చూడడం తగ్గించి పుస్తక పఠనంపై దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో సక్సెస్ షోటోకాన్ కరాటే ప్రతినిధులు రవీందర్ కుమార్, అనిల్, రాజు, శ్రీనివాస్, నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్‌నాయక్, సుధాకర్ పాల్గొన్నారు.
పరీక్షల వేళ భయాందోళన వద్దు
మొయినాబాద్‌రూరల్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ ప్రైవేట్ కళాశాలల చైర్మన్ గౌరీ సతీష్ అన్నారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్‌లో ఆదివారం ఆయన మాట్లాడారు. ఈనెల 5 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఇంటర్‌బోర్డు నియమావళిని తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఉదయం 8.45 గంటలలోపు వచ్చిన వారినే పరీక్షలకు అనుమతించనున్నారని, ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరని చెప్పారు. సమయాన్ని పాటి స్తూ విద్యార్థులు 30 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాలకు వెళ్లాలని బోర్డు తొలిసారి నిబంధనలు అమలులోకి తెచ్చిందన్నారు. తల్లిదండ్రు లు విద్యార్థులను ప్రోత్సహిస్తూ.. పరీక్ష కేంద్రాలకు తగిన సమయానికి తీసుకెళ్లాలన్నారు. ఏవైనా సందేహాలుంటే 92402 05555 టో ల్‌ఫ్రీ నంబర్‌తో పాటు జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి
కడ్తాల్: పర్యావరణ పరిరక్షణలో యువకులు కీలక పాత్ర వహించాలని పర్యావరణవేత్త డాక్టర్ సాయిభాస్కర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్మాస్‌పల్లి గ్రామ సమీపంలోని ఎర్త్ సెంటర్‌లో కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, అయిస్టర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన సస్టెయినబుల్ ఈకో అడ్వెంచర్ క్యాంపు ఆదివారం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అయిస్టర్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సింగాడే సునీల్, పర్యావరణ వేత్త సాయిభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ.. మానవళి మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. జంతువులు, అడవుల సంరక్షణ, జీవ వైవిధ్య ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం క్యాంపు విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో సీజీఆర్ చైర్ పర్సన్ లీలా లక్ష్మారెడ్డి, ప్రతినిధులు జ్ఞానేశ్వర్, రజనీకాంత్, అయిస్టర్ సంస్థ ప్రతినిధులు అనంతశర్మ, అరవింద్, వెంకటేశ్, కృష్ణవేణి, శివ, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నిజమైన భక్తి ఉండాలి
పరిగి: ప్రతి ఒక్కరూ నిజమైన భక్తిప్రపత్తులు కలిగి ఉండాలని ప్రముఖ కవి, శాసనమండలి సభ్యుడు గోరటి వెంకన్న అన్నారు. ఆదివారం పరిగి పట్టణంలో ప్రముఖ వక్త డాక్టర్ భాస్కరయోగిచే నిర్వహిస్తున్న పాల్గున సత్సంగంలో పాల్గొని మాట్లాడారు. శరణాగతి.. భక్తి ద్వారా కలుగుతుందని తెలిపారు. భాగవతంలో శుకమహార్షి, ప్రహ్లాదుడు, ఆంజనేయస్వామి భక్తికి మార్గదర్శకులని పేర్కొన్నారు. పరమాత్మ వైపు అడుగులు వేయాలంటే భక్తి ప్రాథఽమికంగా హృదయంలో నిలబడాలని.. అది ఆరిపోని జ్యోతిలా వెలగాలని అన్నారు. కార్యక్రమంలో ప్రహ్లాద్‌రావు, మాధవరెడ్డి, నరేందర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, పాండుచారి పాల్గొన్నారు.

ప్రతి ఇంట్లో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోండి
Comments
Please login to add a commentAdd a comment