గోల్కొండ: ఇంజినీరింగ్ కాలేజీ స్పోర్ట్స్ మీట్‌కు తమ కళాశాల వేదిక కావడం ఆనందంగా ఉందని షేక్‌పేట్ జి.నారాయణమ్మ మహిళా ఇంజినీరింగ్ కళాశాల వైస్ చైర్‌పర్సన్ జి.శ్రీవిద్యారెడ్డి అన్నారు. 11వ జాతీయ ఇంటర్ ఇంజినీరింగ్ కాలేజీ స్పోర్ట్స్ మీట్ ఫర్ ఉమెన్ ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టెబుల్ టెన్నీస్ క్రీడాకారిణి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ నికత్‌భాను హాజరై మాట్లాడుతూ.. తాను కూడా మహిళా విభాగంలో ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్నట్లు తెలిపారు. డిలైట్ కంపెనీ డెలివరీ మెనేజర్ ఎం.అఖిల మాట్లాడుతూ..జీఎన్‌ఐటీఎస్ అలూమీనిగా తాను మరోసారి ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జీఎన్‌ఐటీఎస్ చైర్మన్ జి.రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రమేశ్‌రెడ్డి, స్టూడెంట్స్ అఫైర్స్ డీన్ డాక్టర్ అపర్ణ పల్లె, వర్వ్–2025 కన్వీనర్ డాక్టర్ ఎం.వీ.ఎల్.సూర్యకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment