కేపీహెచ్‌బీకాలనీ: కుటుంబ తగాదాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఓ వ్యక్తి సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నేపాల్ దేశానికి చెందిన ప్రేమ్ రావెల్ (34) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కేపీహెచ్‌బీకాలనీలోని నాల్గో ఫేజ్‌లో నివాసం ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ తగాదాలు భరించలేక శనివారం రాత్రి ఇంటి సీలింగ్ ఫ్యాన్‌కు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment