మాడ్గుల: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మాడ్గుల సీఐ వేణుగోపాల్ రావు తెలిపారు. సోమవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా అందుగుల వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్లు, యాజమనులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు సీఐ తెలిపారు.
ముసుగులు ధరించిసైకిల్ చైన్లతో బెదిరింపులు
బంజారాహిల్స్: ముసుగులు ధరించి సైకిల్ చైన్లు ఊపుకుంటూ హోటలోకి ప్రవేశించిన ఆగంతకులు కస్టమర్లను బెదరింపులకు గురిచేస్తూ గదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేసిన ఘటనలో నిందితులపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌కు చెందిన సుజాహత్ హుస్సేన్ (38) 2015లో బంజారాహిల్స్ రోడ్ నెంబర్–4లోని బగ్గా హోటల్స్‌ను లీజుకు తీసుకున్నాడు. 2030 వరకు ఈ లీజు గడువు ఉండగా బగ్గా హోటల్స్ యజమానులు సత్పాల్‌సింగ్ బగ్గా, బల్వీందర్ బగ్గా మధ్య అద్దె విషయంలో గొడవలు వచ్చాయి. ఈ విషయంలో కోర్టులో కేసు నడుస్తుంది. ఇదిలా ఉండగా ఆదివారం రాత్రి 10 మంది ఆగంతకులు ముఖాలకు ముసుగులు ధరించి హో టల్‌లోకి ప్రవేశించి రిసెప్షనిస్ట్ సుభాన్‌ను బెదిరించి అక్కడి ను ంచి వెళ్లిపోవాల్సిందిగా హెచ్చరించారు. అలాగే కస్టమర్లు ఉన్న గదుల వద్దకు వెళ్లి సైకిల్ చైన్లు ఊపుకుంటూ ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ బెదిరింపులకు గురిచేశారు. రిసెప్షనిస్ట్ ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న సుజాహత్ డయల్ 100కు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే ముసుగులు ధరించిన వ్యక్తులంతా అక్కడి నుంచి పరారయ్యారు. సత్ఫాల్‌సింగ్ బగ్గా, బల్వీందర్‌సింగ్ బగ్గా ఇద్ద రూ హోటల్‌లోకి రౌడీలను పంపించారని, భయభ్రాంతులకు గురిచేశారని, విధ్వంసం సృష్టించారని, మెటీరియల్ ధ్వంసం చేశారని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment