కేశంపేట: బైక్ పైన వెళ్తున్న తండ్రీకొడుకులను బొలెరో వాహనం ఢీకొన్న సంఘటన మండలపరిధిలోని ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... అల్వాల గ్రామ పరిధిలోని తులవానిగడ్డకు చెందిన రంగయ్య, తన కుమారుడు ఉజ్వల్‌తో ఆదివారం ఎక్లాస్‌ఖాన్‌పేట గ్రామానికి హెర్ కటింగ్ కోసం వెళ్లాడు. తిరిగి వస్తుండగా బీఎస్‌ఆర్ పెట్రోల్ పంపు దగ్గర బొలెరో వాహనం వీరి బైక్‌ను ఢీకొంది. దీంతో తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. సోమవారం రంగయ్య పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment