క్రీడల్లోనూ రాణించాలి
ఓఎన్‌జీసీ అధికారి శంకర్‌నాయక్
కొత్తూర్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడాల్లో రాణించి, ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అంతర్జాతీయ అథ్లెట్, ఓఎన్‌జీసీ అధికారి శంకర్‌నాయక్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం యూత్ క్లబ్ ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. క్రీడలపై అభిరుచి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ అంగూర్‌నాయక్, ఉపాధ్యాయులు రవికుమార్, రాజు, బాలప్రసాద్, పీఈటీ నవనీత తదితరులు పాల్గొన్నారు.
అనుమానమే.. పెనుభూతమై
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
ఇబ్రహీంపట్నం రూరల్: కుటుంబ కలహాలతో జీవితంపై విరక్తి చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదిబట్ల మున్సిపాలిటీలోని ఎంపీపటేల్‌గూడకు చెందిన పట్నం నరేశ్‌కి పన్నెండేళ్ల క్రితం ఉమాతో వివాహమైంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాఫీగా సాగుతున్న కాపురంలో అనుమానం పెనుభూతంగా మారింది. దీంతో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండేవారు. ఐదు నెలల క్రితం నరేశ్(36) మద్యం తాగి భార్యను కొడుతున్నాడని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అమ్మగారింటికి వెళ్లిపోవడంతో రెండు నెలల క్రితం పెద్దలు ఒప్పించి కాపురం చేయించారు. ఆదివారం రాత్రి 10 గంటలకు మళ్లీ భార్యాభర్తలు గొడవ పడడంతో 100 ఫోన్ చేశారు. పోలీసులు ఇంటికి చేరుకొని నచ్చజెప్పి గొడవ లేకుండా ఉండాలని సముదాయించారు. భార్య ఇద్దరు పిల్లలను పడక గదిలోంచి బయటకు పంపించి నరేశ్ తలుపు వేసుకున్నాడు. సోమవారం ఉదయం గది నుంచి ఉలుకుపలుకు లేకపోవడంతో భార్యకు అనుమానం వచ్చి డోర్ కొట్టడంతో తలుపు తీయలేదు. దీంతో పక్కింటివారు తలుపు పగలగొట్టి చూడగా నరేశ్ మృతదేహం ఫ్యాన్‌కు వేలాడుతుంది. దీంతో భార్య ఉమా బోరున విలపించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
గచ్చిబౌలి: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకన్న కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా, తోర్‌మామిడికి చెందిన కమలాపురం దేవిక(25) మాదాపూర్‌లోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తోంది. మంచిర్యాల మార్కెట్ రోడ్డుకు చెందిన సద్గుర్తి శరత్ చంద్రతో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీయడంతో పెద్దల అంగీకారంతో వారిరువురు గత ఆగస్టు 23న గోవాలో పెళ్లి చేసుకున్నారు. రాయదుర్గంలోని ప్రశాంత్‌హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా వారి మధ్య గొడవ జరగడంతో దేవిక గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. బయటికి వెళ్లి తిరిగి వచ్చిన శరత్‌చంద్ర తలుపు తట్టినా దేవిక స్పందించకపోవడంతో నిద్రపోయి ఉంటుందని భావించాడు. సోమవారం ఉదయం 10 గంటలైనా దేవిక బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన శరత్ చంద్ర తలుపు విరగ్గొట్టి చూడగా ఆమె ఉరి వేసుకుని కనిపించింది. ఇరుగు పొరుగు సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది. వర కట్నం కోసం శరత్‌చంద్ర తన కుమార్తెను వేధిస్తున్నాడని, ఈ కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతురాలి తల్లి రామలక్ష్మి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
క్రీడల్లోనూ రాణించాలి
క్రీడల్లోనూ రాణించాలి
Comments
Please login to add a commentAdd a comment