వ్యక్తి ఆత్మహత్య
కొందుర్గు: తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని తంగెళ్లపల్లిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి రమేశ్(38) మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులు మందలించినా వినేవాడు కాదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పాడి పశువులకు పాలు తీయడానికి పొలానికి వెళ్లాడు. ఎంతకి తిరిగి రాకపోవడంతో అతడి తండ్రి చెన్నయ్య వెళ్లి చూసేసరికే పాక వద్దనే నురుగులు కక్కి అక్కడే పడి ఉన్నాడు. వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో షాద్‌నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే రమేశ్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఎన్టీఆర్ ఘాట్ వద్దకారు బీభత్సం
రోడ్డు డివైడర్‌ను ఢీకొని ఫుట్‌పాత్ పైకి ఎక్కిన కారు..
లక్డీకాపూల్ : నెక్లెస్ రోడ్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు డివైడర్‌ను ఢీ కొని ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ముప్పు తప్పింది. సోమవారం ఖైరతాబాద్ జంక్షన్ నుంచి సెక్రటేరియేట్ వైపు వెళుతున్న ఓ కారు అతివేగం కారణంగా ఎన్టీఆర్ ఘాట్ మలుపు వద్ద అదుపు తప్పింది. కారు డివైడర్‌పైకి దూసుకెళ్లి కరెంట్ పోల్‌ను ఢీకొనడంతో పోల్ రోడ్డపై అడ్డంగా విరిగిపడింది. ఈ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో విద్యుత్ స్తంభంతో పాటు రెండు చెట్లు ధ్వంస మయ్యాయి. కాగా కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా అనే కోణంలో విచారణ చేపట్టారు. ప్రమాదం అనంతరం కారు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయినట్లు సమాచారం.
ఏసీబీ వలలో డీఈఈ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ క్వాలిటీకంట్రోల్ విభాగంలో డిప్యూటీ ఈఈగా పనిచేస్తున్న ఎ.దశరథ్ ముదిరాజ్ ఫైల్స్ క్లియర్ చేయడానికి, వాటిని ఈఈకి పంపించేందుకు ఒక వ్యక్తిని రూ.20వేలు డిమాండ్ చేసి,తీసు కుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. లంచం సొమ్మును స్వాధీనం చేసుకొని నాంపల్లి ఏసీబీ కేసుల కోర్టులో హా జరు పరిచారు. అడ్వాన్స్‌గా అంతకు ముందే రూ. 10వేలు తీసుకున్నట్లు ఏసీబీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment