మండి హోటళ్లలో తనిఖీలు
పహాడీషరీఫ్: జల్‌పల్లి మున్సిపాలిటీ పరిధి ఎర్రకుంటలోని మండి హోటళ్లలో కమిషనర్ వెంకట్రామ్ సోమవారం తనిఖీలు చేపట్టారు. బాలాపూర్ ఎస్‌ఐ షేక్ యూసుఫ్ జానీతో కలిసి ఆయన అల్–సవూద్ బైతల్ మండి, అబూద్ మండి హోటళ్లలో కిచెన్ రూమ్‌లో పరిశీలించగా అపరిశుభ్రమైన వాతావరణం కనిపించాయి. ఈ రెండింటిలో ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన చికెన్, మటన్, చేపలను చూసి కమిషనర్ యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటిసారి హెచ్చరిక చేస్తున్నామని, మరోసారి తనిఖీ చేపడుతామని, పరిస్థితిలో మార్పు లేకుండా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కొందరు హోటల్ నిర్వాహకులు వ్యాపారమే ధ్యేయంగా పెట్టుకొని, నాణ్యమైన ఆహారాన్ని అందించడం లేదన్నారు. ముఖ్యంగా ప్రతి హోటల్ నిర్వాహకుడు శుచి శుభ్రత పాటించడంతో పాటు వ్యర్థ నీటిని రోడ్లపై విడవరాదని సూచించారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మేనేజర్ జ్యోతి, పర్యావరణ అధికారి ఎం.శ్రీను, బిల్ కలెక్టర్ శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఫ్రిజ్‌లలో మాంసం నిల్వలపై అధికారుల ఆగ్రహం
Comments
Please login to add a commentAdd a comment