ఇద్దరి నిందితుల అరెస్టు
చేవెళ్ల: గంజాయి రవాణా చేస్తున్న ముఠాను చేవెళ్ల పోలీసులు చాకచక్యంగా అదుపులోని తీసుకున్నారు. చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్, డిటెక్టివ్ సీఐ సీహెచ్ ఉపేందర్‌లు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కేసారం గ్రామ సమీపంలో బైపాస్ రోడ్డు పక్కన నలుగురు అనుమానిత వ్యక్తులు ఆదివారం రాత్రి ఓ వ్యాగనర్ కారు, స్కూటీపై ఆగి ఉండటం కనిపించారు. అటువైపు వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు ఎస్‌ఐ వనం శిరీష టీమ్‌తో వారి వద్దకు వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించటంతో వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. వాహనాలను తనిఖీ చేయగా రెండు బ్యాగులలో 9 కిలోల గంజాయి ప్యాకెట్లు లభ్యమైంది. దీంతో వారికి అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులు ఏపీలోని రాజమండ్రికి చెందిన గోబెరు వెంకట చైతన్య అలియాస్ షేక్ రిజ్వాన్‌గా గుర్తించారు. మరో వ్యక్తి కూరెళ్ల సాయిఅరుణ్ నగరంలోని ఉప్పల్‌లో ఉంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పారిపోయిన నిందితులు సూర్యాపేటకు చెందిన షేక్ అబ్బాస్, గణేశ్‌లుగా గుర్తించినట్లు విచారణలో చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment