మో‘డల్’ హౌస్!
గుంతలకే పరిమితమైన ఇందిరమ్మ నమూనా గృహం
షాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలకమైన మో డల్ హౌస్ నిర్మాణానికి ఆదిలోనే అడుగు కదల డం లేదు. షాబాద్ మండల కేంద్రంలో నిర్మి స్తున్న నమూనా ఇల్లు గుంతలకే పరిమితమైంది. 15 రోజులు గడుస్తున్నా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ దుస్థితి నెలకొందని స్థానికులు ఆరోపిస్తున్నా రు. నెల రోజుల్లో పనులు పూర్తి చేయాల్సినా సాగదీత ధోరణి అవలంబిస్తున్నారు. దీంతో మోడల్ హౌస్ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందోనని పథకం లబ్ధిదారులు వేచి చూస్తున్నారు.
గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు
సహకరించండి
కడ్తాల్: ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫ్యూచర్ సిటీని కలుపుతూ ఆమనగల్లు మండలంలోని ఆకుతోటపల్లి వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు నిర్మాణానికి రైతులు సహకరించాలని తహసీల్దార్ ముంతాజ్ కోరారు. సోమవారం మండలంలోని ముద్వీన్, ఎక్వాయిపల్లి, మర్రిపల్లికి చెందిన భూ బాధితులతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా అవసరాల దృష్ట్యా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ రోడ్డు ప్రాముఖ్యతను రైతులకు వివరించారు. భూ సేకరణకు సహకరించాలని, సమస్యలుంటే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చర్చిస్తామని తెలిపారు. రైతుల నుంచి వినతులు, సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఐ శివప్రసాద్, ఆర్‌ఐ రాజురెడ్డి, భూసేకరణ కార్యాలయ సిబ్బంది సురేశ్, బుచ్చయ్య, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
నారీ సాధికారతకు
బీసీ సేన పోరాటం
సంఘం జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ
షాద్‌నగర్: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని బీసీ సేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ అన్నారు. పట్టణంలోని సంఘం కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించాలన్నారు. కుటుంబ, దేశం ప్రగతి పథంలో నడవడంలో అతివల పాత్ర ఎంతో కీలకమన్నారు. నారీ సాధికారత కోసం బీసీ సేన పోరాటం చేస్తుందని తెలిపారు. అనంతరం షాద్‌నగర్ నియోజకవర్గ బీసీ సేన మహిళా అధ్యక్షురాలిగా బాస వరలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ప్రశాంత్, నాయకులు చంద్రశేఖర్, సత్యం, శంకర్, చందులాల్, రవి, శివ, వెంకటేష్, జె.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మగ్గం వర్క్‌పై
ఉచిత శిక్షణ
ఇబ్రహీంపట్నం రూరల్: స్వర్ణ భారత్ ట్రస్ట్ ముచ్చింతల్‌లో మగ్గం వర్క్‌పై మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రస్ట్ డైరెక్టర్ జీఎస్‌ఆర్ కృష్ణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్వర్ణ భారత్ ట్రస్ట్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ సహకారంతో శంషాబాద్‌లో మార్చి 4నుంచి 30 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తామని పేర్కొన్నారు. 19నుంచి 45 సంవత్సరాల మధ్య వయసున్న వారు అర్హులని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డుతో మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలతో హాజరు కావాలని సూచించారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ జిల్లాలకు చెందిన గ్రామీణ మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు 7893121143, 9391487797, 9177141712 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
మో‘డల్’ హౌస్!
మో‘డల్’ హౌస్!
Comments
Please login to add a commentAdd a comment