
గోడకు కన్నం వేసి వైన్స్‌లో చోరీ
షాబాద్: గుర్తు తెలియని వ్యక్తులు ఓ వైన్ షాపు గోడను పగలగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన షాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... మూడేళ్లుగా మండలంలోని మద్దూరు గ్రామానికి చెందిన కప్ప హరిబాబు నాగర్‌గూడ దుర్గా వైన్స్‌లో పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే సోమవారం రాత్రి వైన్ షాపు బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం 10:30కి వచ్చి షాపు తెరిచి చూసే సరికి చిందరవందరగా ఉంది. కౌంటర్‌లో ఉన్న రూ.50 వేల నగదు, సీసీ కెమెరా డివైజ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించాడు. షాపు వెనుక నుంచి వెళ్లి రెండు ఫీట్ల గోడను పగలగొట్టి లోపలికి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. హరిబాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రూ.50 వేల అపహరణ
నాగర్‌గూడలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment