విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట
● కాంగ్రెస్ ఆదివాసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘునాయక్
షాద్‌నగర్: విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘం రాష్ట్ర కో ఆర్డినేటర్ రఘు నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని తెలిపారు. అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకులాలకు ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు. షాద్‌నగర్ పరిఽధిలోని కొందుర్గులో నిర్మించే సమీకృత గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.200 కోట్లు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు. గత పాలకులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి అప్పుల పాలు చేసినా సీఎం రేవంత్‌రెడ్డి ఒడిదొడుకులు ఎదుర్కొంటూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్‌ఖాన్, నాయకులు ఇబ్రహీం,బస్వం, వెంకట్‌రెడ్డి,హైదర్‌గోరి,నర్సింలుతదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment