ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: ప్రజావాణికి వచ్చే అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి సంగీత పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి సంగీత మాట్లాడుతూ.. ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం తగదని అన్నారు. అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ వారం 62 అర్జీలు అందాయని చెప్పారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 29, ఇతర శాఖలకు సంబంధించి 33 ఉన్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపాలిటీ అధికారులు, మండల తహసీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీని
సద్వినియోగం చేసుకోండి
హుడాకాంప్లెక్స్: ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వం ప్రకటించిన 25 శాతం రాయితీని సద్వినియోగం చేసుకోవాలని టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి అన్నారు. సరూర్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద ఎల్‌ఆర్‌ఎస్ ప్లాట్ రిజిస్ట్రేషన్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును చెల్లించి ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకుంటే భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతులు సులభంగా వస్తాయని తెలిపారు. దళారులను ఆశ్రయించాల్సిన అవవసరం ఉండదన్నారు.
డబ్బికార్ శ్రీనివాస్‌కు అవార్డు
ఇబ్రహీంపట్నం: తెలంగాణ ఉద్యమంలో చురుకై న పాత్ర పోషించడమేగాక ఆధ్యాత్మికత, సామాజిక సేవ, విద్యా, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఇబ్రహీంపట్నంకు చెందిన ఆరెకటిక సంఘం జాతీయ నాయకుడు డబ్బికార్ శ్రీనివాస్ చేస్తున్న కృషిని గుర్తించి విజన్ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీసీఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బంగారు నంది అవార్డును ప్రదానం చేశారు. నగరంలోని రవీంద్ర భారతిలో సోమవారం జరిగిన కార్యక్రమంలో దైవజ్ఞశర్మ, ఫౌండేషన్ ప్రతినిధుల చేతుల మీదుగా నంది అవార్డును డబ్బికార్ శ్రీనివాస్ అందుకున్నారు. ఈ అవార్డు తన బాధ్యతను మరింత పెంచిందని శ్రీనివాస్ తెలిపారు.
శిక్షలో శిక్షణలు..
ఉపాధికి బాటలు
చంచల్‌గూడ: జైలు శిక్షలో భాగంగా వివిధ అంశాల్లో పొందిన శిక్షణ ఉపాధికి బాటలు వేస్తుందని ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్ అన్నారు. చంచల్‌గూడ మహిళా జైలులో ఖైదీలకు స్వయం ఉపాధి పథకం కింద ప్రవేశపెట్టిన టైలరింగ్ కోర్సును సోమ వారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కోర్సు వృత్తి నైపుణ్యం, ఆర్థిక స్వాతంత్య్రం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. జైళ్లను పునరావాస ప్రదేశాలుగా మారుస్తున్నాయన్నారు. సంకల్ప పథకం కింద నాక్ సంస్థల సహకారంతో ఈ కోర్సును అందిస్తున్నట్లు తెలిపారు.
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
Comments
Please login to add a commentAdd a comment