పిల్లల పెంపకంలో వివక్ష వద్దు
ఉస్మానియా యూనివర్సిటీ: ఆడ, మగ తేడా లేకుండా పిల్లలను సమానంగా పెంచాలని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం జన విజ్ఞాన వేదిక, ఆంధ్రమహిళ కాలేజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలబాలికలకు చిన్న వయస్సు నుంచే సమాన అవకాశాలు కల్పిస్తే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం నేను ఆడపిల్లను –అందుకే తప్పక చదవాలి అనే శీర్షికతో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రూపొందిచిన పోస్టర్‌ను సీతక్క ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డా.కరుణాదేవి, జనవిజ్ఞాన వేదిక నాయకులు రాజా, బీఎన్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డా.వసుంధర రచయిత్రి జూపాక సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment