ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలి
షాద్‌నగర్: ఎస్సీ వర్గీకరణ చట్టం అమలయ్యేంత వరకు అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు నిలిపివేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు పెంటనోళ్ల నర్సింహ డిమాండ్ చేశారు. పట్టణంలో సోమవారం నిర్వహించిన నిరసన దీక్షలో ఆయన మాట్లాడారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నట్టు తెలిపారు. ఈ పోరాట ఫలితంగా సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. వర్గీకరణకు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి మాజీ జస్టిస్ షమీం అక్తర్ ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీగా వర్గీకరించడం జరిగిందని అన్నారు. ఇందులో కొన్ని లోపాలున్నాయని, సవరించాలని కోరగా మార్చి 10 వరకు గడువు ఇచ్చినట్టు చెప్పారు. లోపాల సవరణ పూర్తి కాకుండానే ప్రభుత్వం వివిధ శాఖల్లో ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్లు జారీ చేసిందని పేర్కొన్నారు. దీంతో మాదిగ, మాదిగ ఉపకులాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు భూషణ్, బొబ్బిలి పాండు, చెన్నగళ్ల శ్రావణ్, శ్రీనివాస్, జాంగారి జంగయ్య, సురేష్, శ్రీను, దశరథ్, ప్రేమ్‌కుమార్, కర్రోళ్ల శివకుమార్, మధు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment