
పోగొట్టుకున్న సెల్‌ఫోన్ల అప్పగింత
కడ్తాల్: నూతన సాంకేతిక పరిజ్ఞానం(సీఈఐఆర్)తో పోగొట్టుకున్న సెల్‌ఫోన్లను వెతికి పట్టుకుని సీఐ శివప్రసాద్ బాధితులకు అందజేశారు. మండల పరిధిలోని గోవిందాయిపల్లికి చెందిన జంగయ్య, ఎక్వాయిపల్లికి చెందిన నర్సింహగౌడ్, తలకొండపల్లి మండలం పడకల్‌కు చెందిన హరికృష్ణ, కందుకూర్‌కు చెందిన సాయికుమార్‌లు ఇటీవల వేర్వేరు చోట్ల తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. ఈ మేరకు వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీఈఐఆర్ అప్లికేషన్ ఉపయోగించి సెల్‌ఫోన్లను వెతికి పట్టుకున్నారు. ఈ మేరకు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధితులకు అప్పగించారు. ఎవరైనా సెల్‌ఫోన్లను పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఫోన్ వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడంతో తిరిగి పొందే అవకాశం ఉంటుందని సీఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment