
తక్కువ ధరకు ఇంటర్నెట్ సేవలు
షాద్‌నగర్: పల్లెల్లో ప్రజలకు తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి అన్నారు. షాద్‌నగర్ పరిధిలోని హాజిపల్లి గ్రామంలో టీ ఫైబర్ ద్వారా అందిస్తున్న ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలను ఆయన ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా, కలెక్టర్ నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అజిత్‌రెడ్డి మాట్లాడుతూ.. పల్లెల్లో ప్రజలకు ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ కీలకంగా మారిందన్నారు. ప్రతి పని, సేవలకు తోడు టీవీ, సెల్‌ఫోన్లు, కంప్యూటర్ల వినియోగం ఇంటర్నెట్‌తోనే ముడిపడి ఉన్నాయన్నారు. ప్రభుత్వం తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటితోపాటు కార్యాలయాల్లో ఆన్‌లైన్ సేవలు టీ ఫైబర్ నెట్ ద్వారా సులభం అవుతాయన్నారు. పైలెట్ ప్రాజెక్టుగా హాజిపల్లిలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని, త్వరలో అన్ని గ్రామాల్లో సేవలను విస్తరించనున్నట్లు వివరించారు. అనంతరం గ్రామంలోని ఇంటర్నెట్ ఉన్న ఇళ్లకు, పూరి గుడిసెల్లోకి వెళ్లి వినియోగంపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఫైబర్ ఎండీ ప్రవీణ్, డీపీఓ సురేష్‌మోహన్, ఆర్డీఓ సరిత, తహసీల్దార్ పార్థసారధి, ఎంఈఓ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
● సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment