
సీసీ కెమెరాలతో నేరాల నియంత్రణ
● ఏసీపీ రంగస్వామి
షాద్‌నగర్‌రూరల్: సీసీ కెమెరాలతో నేరాలను నియంత్రించవచ్చని ఏసీపీ రంగస్వామి అన్నారు. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని చించోడ్‌లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని తెలిపారు. ఏదైనా ఘటన చోటు చేసుకుంటే నేరస్తులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. గ్రామస్తులు ఐక్యంగా ఉండి సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం హర్షణీయమని, గ్రామంలో మద్యపాన నిషేధం కొనసాగడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో పట్టణ సీఐ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment