
మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలి
ఇబ్రహీంపట్నం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలని మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొరెంకల నర్సింహ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మండల కమిటీ సమావేశం మంగళవారం సంఘం మండల అధ్యక్షుడు రవణమోని రాజు ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోరెంకల నర్సింహ మాట్లాడుతూ.. మత్స్యకారుల, మత్స్యకార్మిక సంఘం సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు. జల వనరుల్లో ఉన్న మత్స్య సంపదప్రకృతి వైపరీత్యాలు, కాలుష్యంతో చనిపోతే ఎలాంటి నష్టపరిహారం ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 50 ఏళ్లు నిండిన మత్స్యకారులకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలన్నారు. రాష్ట్రంలోని చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం బోర్లు వేయించి మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చెనమోని శంకర్ మాట్లాడుతూ.. మత్స్యకార సొసైటీల బాగోగులు చూడడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాని విమర్శించారు. కార్యక్రమంలో రాయపోల్ సొసైటీ అధ్యక్షుడు మైలారం యాదయ్య, అంకర్ల రమేష్, శేరిగూడ సొసైటీ కార్యదర్శి భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment