
పసికందును ఇవ్వాలంటే పైసలివ్వాల్సిందే ..
● ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది డిమాండ్ ● బాధితుడి ఫిర్యాదుతో అప్పగింత
షాద్‌నగర్: అప్పుడే పుట్టిన పసికందును కుటుంబ స భ్యులకు అందజేసేందుకు ఆ స్పత్రి సిబ్బంది డబ్బులు ఇవ్వా లని డిమాండ్ చేసిన ఘటన షాద్‌నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన బోడ అశోక్ తన భార్య స్రవంతికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. అంతలోనే ప్రసూతి నిమిత్తం ఆపరేషన్ చేసినందుకు, పసికందును ఇచ్చేందుకు రూ.1,500 ఇవ్వాలని సిబ్బంది డిమాండ్ చేశా రు. తన వద్ద రూ.వెయ్యి మాత్రమే ఉన్నాయని చెప్పినా వదల్లేదు. చేసేదిలేక న్యాయం చేయాలని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని అశోక్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశాడు. సూపరింటెండెంట్ సిబ్బందిపై సీరియస్ అవడంతో బిడ్డను అందజేశారు.
కీసరగుట్ట హుండీ లెక్కింపు
కీసర: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి దేవస్థానానికి రూ.92,49,961 ఆదాయం సమకూరింది. ప్రసాదాలు, వివిధ ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా రూ.63,51,060 ఆదాయం రాగా, హుండీ ఆదాయం రూ.28,98,901 వచ్చిందని, ఆలయ చైర్మన్ తటాకం నారాయణ, ఈవో సుధాకర్‌రెడ్డి ప్రకటించారు. మంగళవారం దేవాలయం మహామండపంలో హుండీని లెక్కించారు.
Comments
Please login to add a commentAdd a comment