
భారతదేశం ఔషధ మొక్కలకు పుట్టినిల్లు
కడ్తాల్: అనాది నుంచి భారతదేశం ఔషధ మొక్కలకు పుట్టినిల్లు అని బెంగళూరుకు చెందిన ఆయుర్వేద చికిత్స నిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ శర్మ పేర్కొన్నారు. అన్మాస్‌పల్లి పంచాయతీ పరిధిలోని ఎర్త్ సెంటర్‌లో కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రకృతి ఒడిలో ఒక రోజు పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రావిర్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటు పర్యావరణవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ చంద్రశేఖర్ శర్మ మాట్లాడుతూ.. ఔషధ మొక్కల ఔన్నత్యాన్ని, ప్రాముఖ్యతను గుర్తించి జీవన గమనంలో భాగం చేసుకోవాలని సూచించారు. సీజీఆర్ చైర్‌పర్సన్ లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఇంట్లో ఔషధ మొక్కలు పెంచుకొని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ నిర్వాహకుడు మాధవరెడ్డి, ఉపాధ్యాయులు శేఖర్, జగదీశ్, సీజీఆర్ ప్రతినిధులు జ్ఞానేశ్వర్, నాగేశ్, రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment