ఇక కొత్త కొత్తగా..
సిటీ ఆర్టీసీ..
ఆర్టీసీయే కొనుగోలు చేయాలి...
ఇలా ఉండగా, కేవలం ప్రైవేట్ సంస్థల ఆదాయాన్ని పెంచేందుకు ఆర్టీసీని ప్రభుత్వం బలిపశువును చేస్తోందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ రూట్లలో ప్రైవేట్ బస్సులను నడిపి భారీ మొత్తంలో వాటికి అద్దెలు చెల్లించడం చాలా కష్టమని, ఆర్టీసీయే సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసుకునేవిధంగా నిధులను అందజేయాలని వివిధ సంఘాలకు చెందిన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
గ్రేటర్‌లో దశలవారీగా 2800 ఎలక్ట్రిక్ బస్సులు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్‌లో కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఇప్పుడు ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. రానున్న మూడేళ్లలో 2800 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకనుగుణంగా నగరంలో డిపోల విస్తరణకు అధికారులు ప్రణాళికలను రూపొందించారు. ప్రస్తుతం 28 డిపోలు ఉన్నాయి. ఒక్కో డిపోలో కనిష్టంగా 100 నుంచి 150 వరకు బస్సులు ఉన్నాయి. కొన్ని చోట్ల బస్సులను నిలిపేందుకు తగిన స్థలం లేకపోవడంతో డిపోల బయట పార్కింగ్ చేయాల్సి వస్తోంది. ఎలక్ట్రిక్ బస్సుల కోసం కొత్తగా మరో 10 డిపోలను ఏర్పాటు చేయాల్సి ఉంది. బస్సుల నిర్వహణ, చార్జింగ్ స్టేషన్‌ల కోసం అదనపు డిపోలు అవసరమని అధికారులు గుర్తించారు.
చార్జింగ్ సామర్ధ్యం పెంచేలా...
కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణ కోసం అద్దె ప్రాతిపదికన ఈ ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. పీఎం ఈ డ్రైవ్ (పధానమంత్రి ఎలక్ట్రిక్ డ్రైవ్) పథకంలో భాగంగా ఇవి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ చాలావరకు ప్రైవేట్ సంస్థల చేతుల్లోనే ఉంటుంది. కానీ వాటికి పార్కింగ్, విద్యుత్ చార్జింగ్ సదుపా యం కల్పించవలసిన బాధ్యత ఆర్టీసీపైన ఉంది. ప్రస్తుతం ఒక్కో డిపోలో సామర్థ్యానికి మించిన బస్సులు ఉన్నాయి. వాటిని జిల్లాలకు తరలించి ఎలక్ట్రిక్ బస్సులతో డిపోలను భర్తీచేస్తారు. డీజి ల్ బస్సుల తరహాలో ఎలక్ట్రిక్ బస్సులను పార్కింగ్ చేయడం సాధ్యం కాదు. వాటికి తగినంత స్థలం ఉండాలి. అలాగే ఇప్పుడు ఒక బంక్ వద్ద అన్ని బస్సులకు కొద్ది గంటల్లోనే డీజి ల్ నింపే అవకాశం ఉంది. కానీ ఎలక్ట్రిక్ బస్సులకు విద్యుత్ చార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. ఈ క్రమంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఒకే సారి ఎక్కువ బస్సులకు చా ర్జింగ్ చేసే సదుపా యం ఉండాలి. ఇందుకోసం ప్రతి డిపోలో కనీసం 20 చార్జింగ్ స్టేషన్‌లను ఏర్పా టు చేసి ఆ తరువాత అవసరానికనుగుణంగా విస్తరించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఒక్కో డిపోలో 75 నుంచి 80 బస్సులకు మాత్రమే పా ర్కింగ్, చార్జింగ్ సదుపాయం ఉండేవిధంగా కొత్త డిపోలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇందుకోసం ఆర్టీసీకి ఉన్న సొంత స్థలాలతో పాటు ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల డిపోల కోసం ప్రభు త్వం నుంచి స్థలాలను కోరుతున్నట్లు పేర్కొన్నారు.
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్ల నియామకం
కొత్తగా రానున్న ఎలక్ట్రిక్ బస్సులకు ఆయా సంస్థలే డ్రైవర్‌లను ఏర్పాటు చేస్తాయి. దీంతో ఆర్టీసీకి ప్రత్యేకంగా డ్రైవర్‌లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ మేరకు ప్రస్తుతం పదవీ విరమణ చేస్తున్న డ్రైవర్‌ల స్థానంలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో కొత్తవాళ్లను నియమించుకొనేందుకు సన్నాహాలు చేపట్టారు. డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య పెరిగిన కొద్దీ ఆర్టీసీ డ్రైవర్‌ల అవసరం తగ్గుముఖం పడుతుంది. దీంతో ఇంకా సర్వీసు ఉన్నవాళ్లను జిల్లాల్లోని డిపోలకు బదిలీ చేస్తారు. అదే సమయంలో పదవీకాలం ముగిసిన వాళ్ల స్థానంలో మాత్రం డీజిల్ బస్సుల కోసం తాత్కాలిక పద్ధతిపైన నియమిస్తారు. రానున్న రోజుల్లో ఆ డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టినప్పుడు ఈ తాత్కాలిక డ్రైవర్‌ల అవసరం కూడా ఉండదు. అలాగే ఆర్టీసీ డిపోల్లో మెకానిక్‌లు, శ్రామిక్‌ల నియామకాలు సైతం నిలిచిపోనున్నాయి. ‘ఎలక్ట్రిక్ బస్సులను పెంచే క్రమంలో ఆర్టీసీ డ్రైవర్‌లను స్వచ్ఛంద పదవీ విరమణకు సైతం ప్రోత్సహించనున్నట్లు ఒక అధికారి పేర్కొన్నారు. ఇప్పటికే నగరంలోని వివిధ మార్గాల్లో 254 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నాయి. ఈ బస్సుల్లో ఆర్టీసీ కండక్టర్‌లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆయా సంస్థలకు చెందిన డ్రైవర్లే బస్సులు నడుపుతున్నారు. హైదరాబాద్ సెంట్రోల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) డిపోలో పూర్తిస్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో అక్కడ పని చేసే డ్రైవర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు తదితర సిబ్బందిని ఇతర డిపోల్లో సర్ధుబాటు చేయవలసి వచ్చింది. తాజాగా హయత్‌నగర్–2 డిపోలో కొత్తగా 45 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టారు. దశలవారీగా మరిన్ని బస్సులు రానున్నాయి.
ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ కోసం కొత్తగా 10 డిపోలు
ఒక్కో డిపోలో కనీసం 20 చార్జింగ్ స్టేషన్‌లు
ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో డ్రైవర్‌ల నియామకానికి సన్నాహాలు
క్రమంగా డీజిల్ బస్సుల ఉపసంహరణ
Comments
Please login to add a commentAdd a comment