సోషల్ మీడియాలో పోస్టింగ్‌లపై వైఎస్సార్ సీపీ నేతల ఫిర్
చైతన్యపురి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వ్యక్తులపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు బండారు వెంకటరమణ, నాయకులు మానుకొండ రవీందర్‌రెడ్డి, అక్కోలు శివకుమార్, భరత్‌లు బుధవారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ స్టార్ మానియా అనే ఇన్‌స్ట్రాగామ్ ఐడీ ద్వారా పెట్టిన పోస్టు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని వారు ఆరోపించారు. దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డిని వారు కోరారు. ఫిర్యాదు స్వీకరించామని, లీగల్ ఒపీనియన్ తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ సైదిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment