హాల్ టికెట్ అందజేతలో ఆలస్యం
పరిగి: కళాశాల ఫీజు కట్టకట్టలేదనే కారణంతో సకాలంలో తనకు హాల్ టికెట్ ఇవ్వలేదని, దీంతో పరీక్ష రాయలేకపోయానని ఇంటర్ ఓ విద్యార్థి వాపోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని శ్రీసాయి ఒకేషనల్ జూనియర్ కాలేజీలో నాగేశ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్ బ్యాక్‌లాగ్ సబ్జెక్టులు రాసేందుకు మంగళవారం హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్లాడు. ఫీజు చెల్లించని వారు తర్వాత రావాలని సిబ్బంది సూచించడంతో సాయంత్రం వేళ ఇంటికి వెళ్లిపోయాడు. బుధవారం ఉదయం కాలేజీకి వెళ్లి హాల్ టికెట్ తీసుకుని, సెంటర్‌కు చేరుకునే సరికి సమయం 9:20 కావచ్చింది. దీంతో నిర్వాహకులు అతన్ని పరీక్షకు అనుమతించలేదు. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తాను పరీక్ష మిస్సయ్యానని బాధితుడు ఆరోపించాడు. ఆ విషయంపై ప్రిన్సిపల్ శ్రీశైలంను వివరణ కోరగా.. విద్యార్థి ఉదయం 8:55 నిమిషాలకు హాల్‌టికెట్ కోసం వచ్చాడని, దీంతోనే ఆలస్యం జరిగిందని తెలిపారు.
పరీక్ష మిస్సయిన ఇంటర్ విద్యార్థి
Comments
Please login to add a commentAdd a comment