శంషాబాద్: కులగణన చేయడం చరిత్రాత్మక విషయమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. ముదిరాజ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో శంషాబాద్‌లోని ఎమ్మెఎస్ గార్డెన్‌లో బుధవారం ముదిరాజ్ కృతజ్ఞత మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కులగణతో ముదిరాజ్‌ల సంఖ్య స్పష్టమైందన్నారు. భవిష్యత్తులో రాజకీయ రంగంలో ముదిరాజ్‌లకు అపారమైన అవకాశాలు దక్కుతాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ చేపట్టిన కులగణన ముదిరాజ్‌ల సంఖ్యను బహిర్గత పరిచిందని ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజ్‌లకు విస్తృత అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రివర్గంలో కూడా ముదిరాజ్‌ల ప్రాధాన్యం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముదిరాజ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment