ఎయిర్‌పోర్టులో ముంబై పోలీస్ మృతి
శంషాబాద్: మహారాష్ట్రలోని ముంబైకి చెందిన చెందిన పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన శంషాబాద్ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. ఆర్‌జీఐఏ పోలీస్ ఔట్‌పోస్టు సీఐ జె.బాలరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబై కమిషనరేట్ కాలాచౌకి పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న ఎస్‌ఐ అశోక్ శీతల్, హెడ్ కానిస్టేబుల్ మహేష్ రామారావు (49)తో పాటు మరో కానిస్టేబుల్ అశ్విని ఓ కేసు దర్యాప్తు కోసం ఉత్తర్‌ప్రదేశ్ కాన్పూర్‌కు విమానంలో వెళ్తున్నారు. ట్రాన్సిట్ విమానం కావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఆగిన సమయంలో గేట్ 4 వద్దకు వచ్చిన హెడ్ కానిస్టేబుల్ మహేష్ రామారావుకు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే ఎయిర్‌పోర్టులో అపోలో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment