రోడ్డు ప్రమాదానికి గురైన ఇంటర్ విద్యార్థి
తాండూరు టౌన్: తెల్లారితే పరీక్ష ఉండటంతో సెంటర్ ఎక్కడ ఉందో చూసేందుకు బైకుపై వెళ్తున్న ఓ విద్యార్థి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. తాండూరు మండలం సిరిగిరిపేట్‌కు చెందిన శ్రీకాంత్ అనే విద్యార్థి తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్నాడు. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసేందుకు బైకుపై ఇందిరాచౌక్ నుంచి హైదరాబాద్ రోడ్డు మార్గంలో వెళ్తుండగా.. రాయల్‌కాంటా వద్ద టర్నింగ్ తీసుకుంటున్న జనగాం గ్రామానికి చెందిన పట్నం సుధాకర్ బైకు ఢీకొన్నాయి. దీంతో కిందపడిన శ్రీకాంత్ తలకు తీవ్ర గాయమైంది. సమాచారం మేరకు 108లో తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై ఇంకా ఫిర్యా దు అందలేదని పట్టణ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment