సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పాలకమండలి కార్పొరేటర్లు, అధికారులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ‘స్పోర్ట్స్ మీట్’ నిర్వహించనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో కొందరు సభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు జీహెచ్‌ఎంసీ ఇందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 7 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ఈ పోటీల్లో విజేతలకు రూ.10 వేలు, రూ,6 వేలు, రూ.3 వేల నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు ఫైనల్స్‌లో గెలిచిన జట్లకు ఎక్సలెన్స్ అవార్డులు అందజేయనున్నారు. పది అంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. ప్రస్తుత పాలకమండలికి చివరి సంవత్సరం కావడంతో కార్పొరేటర్ల వినతి మేరకు జీహెచ్‌ఎంసీ ఇందుకు సిద్ధమైంది.
Comments
Please login to add a commentAdd a comment