ఎల్‌ఆర్‌ఎస్ రాయితీపై ప్రచారం చేయండి
ఆస్తిపన్ను వసూలు టార్గెట్ చేరుకోవాలి ● అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
పహాడీషరీఫ్: ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ విషయంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సూచించారు. బుధవారం ఆమె జల్‌పల్లి మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్, టీపీఓ హబీబున్నీసాలతో పలువిషయాలపై చర్చించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు ఎన్నిదరఖాస్తులు వచ్చాయని ప్రశ్నించారు. ఈ నెల 31లోగా ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి 25 శాతం రాయితీ వస్తుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని చెప్పారు. ఆస్తిపన్ను వసూలుకు 25 రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో లక్ష్యాలను చేరుకునేలా బిల్‌కలెక్టర్లను అప్రమత్తం చేయాలని సూచించారు. అనంతరం 2025–26 సంవత్సరానికి గాను రూ.36 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఆఫీసర్ జ్యోతి, అకౌంటెంట్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిశీలన
జల్‌పల్లి మున్సిపాలిటీలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను బుధవారం అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ సందర్శించారు. షాహిన్‌నగర్‌లోని ఓ.ఎస్.జూనియర్ కళాశాల, గ్లోరీ జూనియర్ కళాశాలలకు విచ్చేసిన ఆమె ఆయా కేంద్రాల్లో వసతులను పరిశీలించారు. మాస్ కాపీయింగ్‌కు తావులేకుండా చూడాలని ఇన్విజిరేటర్లను ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరీక్షా కేంద్రాల వద్ద వసతులు పరిశీలించాలని మున్సిపల్ కమిషనర్ వెంకట్రామ్‌కు సూచించారు. ట్రాఫిక్, ఇతర సమస్యలు లేకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment