అదుపు తప్పి కారు బోల్తా
కొడంగల్ రూరల్: మండల పరిధిలోని పర్సాపూర్ గ్రామ సమీపంలో ఇన్నోవా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలైన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన ఆరుగురు వ్యక్తులు మహబూబ్‌నగర్‌లో జరిగే పెళ్లి కోసం గురువారం మధ్యాహ్నం బయలుదేరారు. పర్సాపూర్ సమీపంలో ఓ మలుపు దగ్గర ఇన్నోవా కారు అదుపుతప్పి రోడ్డు కింది భాగంలోకి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం కొడంగల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం వైద్యులు సలహా మేరకు తాండూర్ ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
ఇద్దరికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment