పెళ్లికి నిరాకరించిన ప్రియురాలు ప్రేమికుడి ఆత్మహత్యాయత్
మైలార్‌దేవ్‌పల్లి: ప్రేమించిన యువతి ఇంటి ముందు ప్రేమికుడు ఆత్మహత్యయత్నం చేసిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ పైడి నాయుడు సమాచారం మేరకు... బాగ్‌లింగంపల్లి ప్రాంతానికి చెందిన సోను(21) డిగ్రీ చదువుతున్నాడు. లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డు కాలనీ, బృందావన్ కాలనీకి చెందిన అంబిక(21) ఎల్‌ఎల్‌బీ చదువుతుంది. ఇద్దరు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ప్రియురాలు ప్రియడిని కాదనండంతో మనస్థాపానికి గురై గురువారం ప్రియురాలు ఇంటి ముందు ఉన్న మొదటి అంతస్తు పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని హల్‌చల్ చేశాడు. ఈ సమయంలో తన వెంట తెచ్చుకున్న బ్లెడ్‌తో కోసుకొని ఫ్లోర్ క్లీనర్‌ను తాగాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకొని యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే 108కి ఫోన్ చేసి అంబులెన్స్‌లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
బిల్డింగ్ మొదటి అంతస్తు ఎక్కి దూకుతానని హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment