దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలు
కొడంగల్ రూరల్: బాటసారుల దాహార్తిని తీర్చేవి చలివేంద్రాలని తహసీల్దార్ విజయకుమార్ పేర్కొన్నారు. పెరుగుతున్న ఎండలకు బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ విజయకుమార్ తెలిపారు. గురువారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సిబ్బందితో కలిసి చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బాటసారులకు చలివేంద్రాలు కొంత ఉపశమనం కలిగిస్తాయన్నారు. వడ దెబ్బ తగలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రెవె న్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తహసీల్దార్ విజయకుమార్
Comments
Please login to add a commentAdd a comment